16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 57 ఏళ్ల వృద్ధుడు.. !

హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. డబ్బులకు ఆశపడి 16 ఏళ్ల బాలికను 57 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి చేశారు. బాలికలను పెళ్లి చేసుకున్న వ్యక్తి కేరళకు చెందిన అబ్దుల్ లతీఫ్ గా గుర్తించారు. పాతబస్తీకి చెందిన ఎండీ గౌస్ అనే వ్యక్తి భార్య కొన్నాళ్ల క్రితం చనిపోయింది. దీంతో అతడు మరో వివాహం చేసుకున్నాడు. 

మొదటి భార్యకు 16 సంవత్సరాల కూతురు ఉంది. ఆ బాలికలను పెళ్లి జరపడానికి దళారులు ఏర్పాట్లు చేశారు. బాలిక తండ్రికి, ఆమె సవతి తల్లికి డబ్బు ఆశ చూపి పెళ్లికి ఒప్పించారు. దీనికి కోసం దళారులు లతీఫ్ వద్ద రూ.2.5 లక్షలు వసూలు చేశారు. అందులో రూ.1.5 లక్షల మొత్తాన్ని బాలిక తల్లిదండ్రులకు ఇచ్చినట్లు తెలిసింది.   

డిసెంబర్ 27న  57 ఏళ్ల వృద్ధుడు లతీఫ్ కు 16 ఏళ్ల బాలికు బండ్లగూడలో వివాహం జరిపించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో గౌస్ ఇంటికి చేరుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహం చేసుకున్న వృద్ధుడు లతీఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా నడుపుతున్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment