ముక్కు, నోరు మూసుకుని తమ్మితే.. మెడ ఎముకలు విరిగాయి..!

తమ్ములు అనేది ఏ సమయంలో అయినా రావచ్చు. దానిని ఎవరూ నియంత్రించలేరు. సాధారణంగా తుమ్మినప్పుడు ఎవరైనా కళ్లను మూసివేస్తారు. కళ్లు తెరిచి తుమ్మడం వల్ల కనుగుడ్లు బయటకు వస్తాయని చాలా మంది చెబుతుంటారు. అయితే తమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు ముసుకుంటే ఏమవుతుంది? అలా ప్రయత్నించి ఓ వ్యక్త ఆస్పత్రి పాలయ్యాడు..

పోర్చుగల్ కు చెందిన ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును బలవంతంగా ఆపాలనుకున్నాడు. తమ్ము వచ్చే సమయంలో తన ముక్కు, నోరు ఒకేసారి మూసుకున్నాడు. ఈక్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. గొంతులో నొప్పి, మింగడంలో అవస్థలు పడ్డాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాడు. 

వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల బుడగలు వచ్చినట్లు గుర్తించారు. గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృదువైన మెడ కణజాలం, ఛాతిని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు. జీవితంలో ఎప్పుడైనా తుమ్మేటప్పుడు ముక్కును మూసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.  

Leave a Comment