‘రెండేళ్లు సోషల్ మీడియా వాడొద్దు’

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిన కేసులో అలహాబాద్ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. నిందితుడు రెండేళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్న షరతుతో బెయిల్ మంజూరు చేసింది. దేవరియాకు చెందిన అఖిలానంద రావు సీఎం యోగిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ ఏడాది మేలో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. సెక్షన్ 419, 420,120బి, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66డి కింద అతనిపై కేసు నమోదైంది. అయితే హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.   

Leave a Comment