స్లెడ్జింగ్ కు దిగిన ఆసీస్ ఆటగాడు లబూషేన్.. ముగిసిన రెండో రోజు ఆట..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు, తీయగా బుమ్రా, సైనీ చెరో రెండు వికెట్లు, సిరాజ్ 1 వికెట్ తీశారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుజారా(9 బ్యాటింగ్), రహానే(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(26), శుబ్ మన్ గిల్(50) పరులుగు చేసి అవుట్ అయ్యారు. 

కాగా రెండో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్లను ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ స్లెడ్జింగ్ చేశాడు. ప్రధానంగా గిల్ ను టార్గెట్ చేస్తూ స్లెడ్జింగ్ చేశాడు. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ గిల్ ను ‘నీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు’ అంటూ ప్రశ్నించాడు. దానికి గిల్ కూడా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. 

నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే మ్యాచ్ ముగిసిన తర్వాత చెబుతానే అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత సచిన్ లేక విరాట్ అంటూ ప్రశ్నించాడు.. రోహిత్ స్ట్రైక్ చేస్తున్న సమయంలోనూ అదే విధంగా విసిగించాడు. ‘హేయ్.. క్వారంటైన్ ఏం చేశావ్’ అంటూ రోహిత్ పై స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్వీట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 

Leave a Comment