మూడో టెస్టుకు టీమిండియా జట్టు ఇదే..!

ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇక ఫామ్ లో లేని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించారు. ఇటీవల గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీనీ జట్టులో తీసుకున్నారు. 

ఈ మ్యాచ్ ద్వారా సైనీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేయనున్నాడు. గాయపడిన ఉమేశ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ల పేర్లను ముందు పరిశీలించిన టీమ్ మేనేజ్మెంట్ ఎక్స్ ప్రెస్ వేగంతో బౌలింగ్ చేసే సైనీ వేపే మొగ్గుచూపింది. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా, భారత్ చెరో టెస్టు గెలిచి 1-1 తో సమానంగా ఉన్నాయి. 

మూడో టెస్టుకు టీమిండియా జట్టు ఇదే..

అజింక్యా రహానె(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ. 

 

Leave a Comment