రైతు ఆందోళనకు మద్దతుగా భగత్ సింగ్, అంబేద్కర్ కుటుంబ సభ్యులు..!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతం అవుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను కూడా రైతు సంఘాలు తిరస్కరించాయి. 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను శాంతింప జేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపింది. అయితే అవి ఫలప్రదం కాలేదు. 

కాగా ఢిల్లీలో రైతు పోరాటాలకు మద్దతుగా ఎంతో మంది మద్దతుగా నిలుస్తున్నారు. రైతులకు మద్దతుగా స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు భగత్ సింగ్ కుటుంబ సభ్యులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజా రతన్ అంబేద్కర్ కూడా రైతు ఆందోళనలో పాల్గొన్నారు.  

Leave a Comment