నిమ్మగడ్డ కు షాక్.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రద్దు..!

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రద్దు చేసింది. స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ ను ఎస్ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది.

ప్రజారోగ్యం, వ్యాక్సిన్ పంపిణీని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డు అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందేనని, ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. 

 

Leave a Comment