‘సామ్ జామ్’ షోలో సమంతతో చిరంజీవి..ఫొటోలు వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న టాక్ షో ‘సామ్ జామ్’ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫాం ‘ఆహా’ ఈ షోను నిర్వమిస్తోంది. ఈ షోకు సమంతను వ్యాఖ్యాతగా చేస్తున్నారు. సామ్ జామ్ షోలో సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో జనాలను ఎంటర్ టైన్మెంట్ ఇవ్వనున్నారు.

నవంబర్ 13న ఈ షో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షో మొదటి ఎపిసోడ్ లో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. ఇంకా మున్ముందు తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి, అల్లు అర్జున్ కూడా ఈ షోలో కనువిందు చేయనున్నారు. తాజాగా ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ షోలో త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం అవుతుంది.  

Leave a Comment