ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన..!

టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విజయవాడలో కూల్చిన 9 ఆలయాలను పునర్నిర్మించే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఈ పనులకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..

  • రాహు-కేతు ఆలయం
  • సీతమ్మ పాదాలు ఆలయం
  • దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం
  • రాతితో శ్రీ శనీశ్వర ఆలయం
  • బొడ్డు బొమ్మ ఆలయం
  • శ్రీ ఆంజనేయస్వామి ఆలయం(దుర్గాగుడి మెట్ల వద్ద)
  • శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం
  • వీరబాబు ఆలయం(పోలీస్ కంట్రోల్ రూపం సమీపంలో)
  • కనకదుర్గ నగర్ లో శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరం, గోశాల

Leave a Comment