సీఎం జగన్ మరో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ప్లాట్లు..!

పట్టణ, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పట్టణ, నగర పేదలకు తక్కువ ధరలకు ప్లాట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వమే లే-అవుట్లను అభివృద్ధి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. 

 ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొను్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని, ప్రభుత్వమే లే-అవుట్లను అభివృద్ధి చేస్తే అలాంటి భయాలు ఉండవని సీఎం జగన్ చెప్పారు. వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్ తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయిస్తామని వెల్లడించారు. దీని కోసం ఓ సరికొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

 

Leave a Comment