మెగా హీరోలిద్దరికీ కరోనా పాజిటివ్..!

మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు ఈ రోజు ఉదయమే రామ్ చరణ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనను ఇటీవల కాలంలో కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం, రికవరీ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తానని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ ఉన్నట్లు రామ్ చరణ్ వెల్లడించారు. 

తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, కొద్దిగా లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉన్నానని, త్వరలోనే తిరిగి వస్తానని, మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడినని సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు. ఇక రామ్ చరణ్, వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో మెగా ఫ్యామిలీలో టెన్షన్ మొదలైంది. 

Leave a Comment