టీమిండియా క్రికెటర్ల కూతుళ్ల టీమ్.. కెప్లెన్ ఎవరంటే..!

టీమిండియా ఆటగాళ్లు చాలా మందికి కూతుర్లు పుట్టారు. భారత కెప్టెన్ కోహ్లీ కూడా ఇటీవల కూతురు పుట్టింది. ఈతరం ఆటగాళ్లకు ఎక్కువ మందికి కూతుర్లు పుట్టడంపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే మహిళా క్రికెట్ జట్టు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. కుమార్తెలు ఉన్న క్రికెటర్ల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ పేరు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ధోనికి కూడా కూతురు ఉందని.. ఆమె ఈ టీమ్ కు కెప్టెన్ అవుతుందా అని సరదాగా సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

 

Leave a Comment