సొహైల్ పొజిషన్ ను మెహబూబ్ లీక్ చేశాడా?

 బిగ్ బాస్ – 4 గ్రాండ్ ఫినాలే ముగిసింది. అభిజిత్ విజేతగా నిలవగా, అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. కాగా ముగ్గురు ఫైనలిస్టులలో ఒకరు తప్పుకుంటే రూ.25 లక్షలు తీసుకెళ్లవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ను అంగీకరించిన సొహైల్ రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. 

కాగా ఈ గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వారికి టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్ లోకి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ గా హౌజ్ లో ఎంట్రీ ఇచ్చారు. 

అక్కడి కంటెస్టెంట్లను ఎంటర్ టైన్ చేశారు. అయితే మెహబూబ్ మాత్రం సొహైల్ తో ఏవో సైగలు చేశాడు. సొహైల్ పొజిషన్ ను మెహబూబ్ లీక్ చేశాడని మిగితా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకునే ఆఫర్ వస్తే వదిలిపెట్టవద్దని సూచించినట్లు వారు ఆరోపిస్తున్నారు. సొహైల్ డబ్బులు తీసుకోవడం వల్లే అభిజిత్ ప్రైజ్ మనీలో కోత పడిందని అభిమానులు మండిపడుతున్నారు. 

Leave a Comment