టిక్ టాక్ దుర్గారవు ఆదాయం ఎంతో తెలుసా?

టిక్ టాక్ దుర్గారావు.. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారికి ఈ పేరు కొత్తకాదు..గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యాడు దుర్గారావు. ముఖ్యంగా దుర్గారావు టిక్ టాక్ తో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తన భార్యతో కలిసి దుర్గారావు చేసిన వీడియోలు బాగా ట్రండ్ అయ్యాయి. ఎక్కడ చూసిన వీరి గురించే చర్చ జరుగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావుకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఎంత అంటే ఆయన పేరు మీద ఏకంగా ‘దుర్గారావు నాట్యమండలి’ అనే అభిమాన సంఘం కూడా ఏర్పడింది. దుర్మారావుకు మాత్రం ‘నక్కిలేసు గొలుసు’ పాట మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ పాటకు కూడా ఎక్కడలేని ఆదరణ లభించింది. ఇక దుర్గారావుకు మాత్రం జబర్దస్త్, అదిరింది షోలలో కూడా అవకాశఆలు వచ్చాయి. 

ఇప్పుడు టిక్ టాక్ లేకపోవడంతో ఇతను కొత్తగా దుర్గారావు నాట్యమండలి పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అందులో తన భార్యతో కలిసి చేసిన డ్యాన్సులను పోస్ట్ చేస్తున్నాడు. వీరి యూట్యూట్ ఛానెల్ కు కేవలం 15 రోజుల్లో లక్ష మంది సబ్ స్కైబర్లు నమోదు కావడం విశేషం. ఇతని ఛానెల్ కు వ్యూస్ కూడా భారీగా వస్తున్నాయి. 

లాక్ డౌన్ సడలింపు కారణంగా అక్కడక్కడ జరిగే ఈవెంట్లలో దుర్గారావు పాల్గొంటున్నాడు. ఎందరో దుర్గారావు అభిమానులు వారిని ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు. దీంతో దుర్గారావు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆయన ఆదయం వేల నుంచి లక్షలకు పెరిగినట్లు తెలిసింది. ఇక యూట్యూబ్ ఛానెల్ నుంచి అతనికి ప్రతి నెలా రూ.50వేలు వస్తుందని సచారం.. అంతే కాదు అతడు చేసే ప్రమోషన్స్ ద్వారా కూడా మరింత ఆదాయం చేకూరుతుంది.  

  

Leave a Comment