భారత క్రికెటర్ల ముద్దు పేర్లు తెలుసా?

Nick Names of India Cricketers

చాలా మందికి భారత క్రికెట్ ఆటగాళ్ల ముద్దు పేర్లు ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆటగాళ్ల పేర్లు అయితే మనుకు తెలుసు కానీ వారి ముద్దు పేర్లు ఏమిటో చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొంత మంది భారత క్రికెట్ ప్లేయర్ల ముద్దు పేర్లను ఇక్కడ తెలుసుకుందాం..

1.సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar Nick Name)

క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించిన సచిన్ టెండూల్కర్ కు చాలా ముద్దు పేర్లు ఉన్నాయి. అభిమానులు ‘క్రికెట్ దేవుడు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ప్రేక్షకులు ‘మాస్టర్ బ్లాస్టర్’ అని పిలిస్తే.. కామెంటేటర్లు ‘లిటిల్ మాస్టర్’ అని, టీమ్ మేట్స్ ‘పాజీ’ అని పిలుస్తారు. ఇక సచిన్ స్నేహితులు ‘టెండుల్యా’ అని ముద్దుగా పిలిచుకుంటారు. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో సచిన్ ను ‘తానియా’ అని పిలిచేవారు.

2.సౌరవ్ గంగూలీ(Sourav Ganguly Nick Name)

సౌరవ్ గంగూలీని అందరూ ‘దాదా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గంగూలీని చిన్నప్పుడు అతడి తల్లిదండ్రులు ‘మహరాజ్’ అని పిలిచేవారు. ఇక ఆఫ్ సైడ్ అద్భుత ప్రదర్శనకు ‘ద గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్’ అనే పేరు వచ్చింది. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జాఫ్రీ బాయ్ కాట్ ‘ద ప్రిన్స్ ఆఫ్ కలకత్తా’ అని పిలుస్తారు. 

3.మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni Nick Name)

ధోనీని గతంలో ‘మహే’ అని పిలిచేవారు. అయితే పాపులారిటీ వచ్చాక అభిమానులు ‘మహి’ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో రెండు పేర్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ‘మహీ’కి ఫిక్సయ్యాడు ధోనీ.

4.విరాట్ కోహ్లీ(Virat Kohli Nick Name)

 విరాట్ కోహ్లీని ముద్దుగా ‘చీకు’ అని పిలుస్తారు. కోహ్లీ పెద్ద చెవులు, చిన్న జుట్టు మంచి బుగ్గలతో చూసేందుకు కుందేలు పిల్లలా ఉండే వాడు. అందుకు కోహ్లీని ‘చీకు’ అని ఢిల్లీలోని కోచ్ లు పిలిచేవారు. 

5.రోహిత్ శర్మ(Rohit Sharma Nick Name)

ముంబై మ్యాన్ రోహిత్ శర్మకు మూడు ముద్దు పేర్లు ఉన్నాయి. కొందరు తన పేరును షార్ట్ చేసి ‘రో’ అని పిలిచేవారు. బంతిని బౌండరీలకు మళ్లించే ఇతడి ఆటతీరుకు ‘హిట్ మ్యాన్’ అనే మరో పేరుంది. ఇక యువరాజ్ సింగ్ ‘షానా’ అనే ముద్దుపేరును పరిచయం చేశాడు. 

6.శిఖర్ ధావన్(Shikhar Dhavan Nick Name)

శిఖర్ ధావన్ టీమిండియాకు ‘గబ్బర్’ అయ్యాడు. ఇక తనలోని కూల్ క్యారెక్టర్ వల్ల అభిమానులు ‘జాట్’ అని పిలుస్తారు. 

7.సురేష్ రైనా(Suresh Raina Nick Name)

రైనాను ముద్దుగా ‘సోను’ అని పిలుస్తారు. అయితే ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పటికీ తెలియదు. ఇంటి దగ్గర ఆడుతుండగా ఎవరో ఇతడిని ‘సోను’ అని పిలిచాడు. అప్పటి నుంచి ఇదే అతడి ముద్దు పేరు అయిపోయింది. 

8.రవీంద్ర జడేజా(Ravinder Jadeja Nick Name)

రవీంద్ర జడేజాను అంతా ‘జడ్డు’ అని పిలుస్తారు. కానీ కొందరు ఈయన్ను ‘సర్ రవీంద్ర జడేజా’ అని కూడా వ్యవహరిస్తారు. జడ్డు వికీపిడియా అకౌంట్ ను కొందరు ఎడిట్ చేసి పరోపకారి(పిలాంత్రోపిస్ట్) అని, నోబెల్ ప్రైజ్ విన్నర్ అని రాశారు. దీంతో ఇతడిని సర్ రవీంద్ర జడేజా అనడం మొదలైంది. 

9.హర్భజన్ సింగ్(Harbhajan Singh Nick Name)

హర్భజన్ సింగ్ ను ఇంట్లో అంతా ‘సోను’ అని పిలుస్తారు. ఫీల్డులోకి వస్తే మాత్రం ‘భజ్జీ’ అని అంటారు. ఇతడి దూకుడు స్వభావ ఆటతీరును, ఇతడు టర్బన్ ధరించడాన్ని సూచిస్తూ ఆస్ట్రేలియా మీడియా ‘టర్బనేటర్’ అని పిలుస్తుంది. 

10.హార్దిక్ పాండ్యా(Hardik Pandya Nick Name)

హార్దిక్ పాండ్యా తన శైలి మరియు ఫ్యాషన్ భావనకు ప్రసిద్ధి చెందారు. అతని ప్రయోగాత్మక కేశాలంకరణ కారణంగా అతడ్ని ‘హెయిరీ’ అనే పేరుతో పిలుస్తారు. ఇంకా ‘రాక్ స్టార్’ అని కూడా పేరుంది.

11.యువరాజ్ సింగ్(Yuvaraj Singh Nick Name)

యువరాజ్ సింగ్ ను అందరూ ‘యూవీ’ అని పిలుస్తారు. జట్లులో జూనియర్స్ అయితే యువరాజ్ ను ‘యూవీ పా’ అని పిలుచుకుంటారు. 

ఇంకా కొంత మంది భారత క్రికెటర్ల ముద్దు పేర్లు..

 • వీరెందర్ సెహ్వాగ్ – వీరు, సుల్తాన్ ఆఫ్ ముల్తాన్
 • రాహుల్ ద్రావిడ్ – ద వాల్, జామ్మి
 • అనిల్ కుంబ్లే – ద జంబో
 • కపిల్ దేవ్ – ద హర్యానా హారికేన్
 • పార్దివ్ పటేల్ – బచ్చా
 • అషీశ్ నెహ్రా – పోపట్
 • ఇర్ఫాన్ పఠాన్ – గుడ్డు టాట్టు
 • వివిఎస్ లక్ష్మణ్ – వెరీ వెరీ స్పెషల్
 • ఛతేశ్వర్ పుజారా – చింటూ
 • మురళి విజయ్ – ద మోంక్
 • యజువేంద్ర చాహల్ – యుజి

 

Leave a Comment