అప్పుడు దేశం కోసం.. ఇప్పుడు రైతుల కోసం పోరాటం.. రైతు ఆందోళనలో ఆర్మీ మాజీ కర్నల్..!

ఈయ‌న పేరు క‌ర్న‌ల్ గుర్‌దేవ్ సింగ్‌. ఈయ‌న 38 ఏళ్లు పాటు భార‌త ఆర్మీలో స‌రిహ‌ద్దుల్లో దేశం కోసం పోరాడారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 78 ఏళ్లు. ఆయ‌న ఉత్త‌రాఖండ్ లోని రుద్ర‌పూర్ నుంచి ఢిల్లీ స‌రిహద్దుకు ఆందోళ‌న చేసేందుకు వ‌చ్చారు. ఆయ‌న‌ కార్గిల్ వార్‌, ర‌క్ష‌క్ జె అండ్ కె వంటి ఆప‌రేష‌న్లో భాగ‌మైయ్యారు. ద‌ట్ట‌మైన మంచులో కూడా దేశం కోసం ప‌ని చేశారు. కాశ్మీర్ వ్యాలీ, లేక్‌దాక్‌, దుగాకిస్తాన్ వంటి ప్రాంతాల్లో ప‌ని చేశారు. దేశం కోసం భూట‌న్‌, చైనా, పాకిస్తాన్లో కూడా ప‌ని చేశారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది.

‘ కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన నూత‌న చ‌ట్టాలతో రైతుల జీవ‌నోపాధికి, దేశ ఆహార భ‌ద్ర‌త‌కు న‌ష్టం చేకూర్చుతుంది.. ప్రధాని మోడీ ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి, కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెట్టారు. నావీ, ఎయిర్ ఫోర్స్‌, ఆర్మీల్లో ఉన్న 90 శాతం ఉద్యోగులు, జ‌వాన్లు రైతుల కొడుకులే. దేశాన్ని ర‌క్షించ‌డంలో సైనికులు ఎంత కీల‌క‌మో…దేశం జీవించ‌డానికి రైతులు అంతే కీల‌కం. అందుకే జై కిసాన్‌…జై జ‌వాన్ అనే చారిత్ర‌క నినాదం మ‌న‌కుంది.’ అని మాజీ కర్నల్ పేర్కొన్నారు.

Leave a Comment