హ్యాట్సాఫ్ డాక్టర్..సైనికుడి తల్లికి ఉచితంగా శస్త్రచికిత్స..!

దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ తల్లికి ఉచితంగా సర్జరి చేసిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ యూరాలజిస్ట్ డాక్టర్ అల్తాప్ షేక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. శాంతాబాయికి కిడ్నీ సమస్యలున్నాయి. ఒక కుమారుడు గుండెపోటుతో మరణించగా, మరొకరు ఏడు సంవత్సరా క్రితం జమ్ము కశ్మీర్ లో అమరుడయ్యాడు. ఆర్మీ వాళ్లిచ్చే పింఛన్ కుమారుని భార్యకు వెళ్తుంది. ఆమెకు ఏ ఆదాయమూ లేదు. 

దీంతో డాక్టర్ అల్తాఫ్ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారు.  శాంతాబాయి డిశ్చార్జి అయి వెళ్తున్న సమయంలో అల్తాఫ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను హత్తుకుని కన్నీళ్లు తుడిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ కూడా డాక్టర్ అల్తాఫ్ ను వ్యక్తిగతంగా పిలిపించుకుని ప్రశంసించారు. ఈ వీడియో చేసిన నెటిజన్లు డాక్టర్ అల్తాఫ్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు.  

Leave a Comment