ప్రభాస్ ‘సలార్’ సినిమాలో నటించే గోల్డెన్ ఆఫర్..!

హీరో ప్రభాస్, కేజీఎప్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా పోస్టర్ ను కూడా సినిమా ఇటీవల యూనిట్ విడుదల చేసింది. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ అదిరింది.  ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 

హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిర్మించబోతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే అవకాశాన్ని కల్పిస్తుంది సినిమా యూనిట్. దీని కోసం ఆడిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. సలార్ సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్న వారు డిసెంబర్ 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వయస్సుతో సంబంధం లేదని పేర్కొంది. తర్వలో బెంగళూరు, చెన్నైలలో కూడా ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపింది.  

 

Leave a Comment