వాహనదారులకు గుడ్ న్యూస్ : ఫాస్టాగ్ గడువు పొడిగింపు..

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ తీసుకోవడానికి డెడ్ లైన్ పొడిగించింది. 2021 జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆ గడువును 2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగించింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ ద్వారా 75-80 లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్ర, రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.నాలుగు చక్రాల వాహనాలు టోల్ ప్లాజా దాటాలంటే వాహనానికి తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాల్సిందే. లేకపోతే సాధారణ ఛార్జీల కన్నా రెట్టింపు ఛార్జీలు చెల్లించకతప్పదు.  

Leave a Comment