రాష్ట్రంలో ఒక్క ఇళ్లయినా నిర్మించారా? : దేవనేని ఉమ

వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు లబ్దిదారులకు ఉన్న ఇళ్లు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానని సీఎం జగన్ కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి దేవినేనీ ఉమామహేశ్వరరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తి అయినా రాష్ట్రంలో ఒక్క ఇళ్లయినా నిర్మించారా అని, పూర్తి అయిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 

శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ అతని బావమరిది జక్కంపూడి లో కోట్ల మేర కొండలు గుట్టలు కొట్టేశారని, లక్షల ట్రిప్పుల గ్రావెల్ ఎత్తుకెళ్లారని ప్రజలకు చూపించాలని వెళితే తనపై 505, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారని చెప్పారు. ఈ కేసులకు దేవినేని ఉమా భయపడడని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు.  ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ సవాళ్ళు విసురుతూ బూతులు మాట్లాడడం సమంజసం కాదన్నారు. 

Leave a Comment