‘ఇస్లాం’ పరీక్షలో హిందూ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్..!

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ (సీయూకే)లో ఇస్లామిక్ మత విద్యలో మాస్టర్స్ కోర్సు కోసం నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రాజస్తాన్ కు చెందిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ ఈ ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించాడు. 

ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడిందని, ఆ మతం గురించి సమాజంలో దురభిప్రాయాలు ఉన్నాయని శుభమ్ యాదవ్ తెలిపారు. దీంతో సమాజంలో చీలికలు వచ్చాయని, అవన్నీ పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. హిందూ ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలన్నారు.

కాగా కశ్మీస్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు మొదటి ర్యాంక్ సాధించడం ఇదే తొలిసారి. యాదవ్ అల్వార్ ప్రాంతానికి చెందిన వాుడ. అతడు ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు.  రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపిన ఘటనలు వెలుగు చూశాయి. దీంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభమ్ తెలిపారు. అయితే ఇస్లామిక్ చట్టాల గురించి అధ్యయనం చేయడానికే తన తొలి ప్రాధాన్యత అని, తర్వాత సివిల్స్ కొట్టడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. 

 

Leave a Comment