ఆన్ లైన్ లో భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. గంటల చొప్పున పంపిస్తా అంటూ ఫొటోలు అప్లోడ్..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు ఓ భర్త. గంటల చొప్పున పంపిస్తానని భార్య  ఫొటోలు అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు తిరుపతికి చెందిన రేవంత్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ఈఏడాది 13న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో బెంగళూరుకు వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన మూడో రోజు నుంచే ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. పెళ్లయిన వారానికే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. 

దీనిపై ప్రశ్నిస్తే తనను అనుమానిస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. భర్త గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది. అదే సమయంలో భార్య ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఆమె షాక్ అయింది. నిలదీసేందుకు భర్త రేవంత్ ఇంటికి వెళ్లగా రేవంత్, అతని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment