నాలుగో టెస్టు ఆడేందుకు నేను రేడీ.. వీరేందర్ సెహ్వాగ్..!

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఆసీస్ పర్యటనకు ఎంపిక నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మూడో టెస్టులో అయితే ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్, హనుమ విహారీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాకు గాయాలయ్యాయి. 

కాగా, బుమ్రా, విహారీ, జడేజా నాలుగో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. పంత్, అశ్విన్ పిట్ నెస్ పై స్పష్టత లేదు. దీంతో నాలుగో టెస్టుకు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో టీమిండియా గాయాలపై మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 

‘భారత జట్టులో ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. నాలుగో టెస్టుకు 11 మంది లేకపోతే చెప్పండి. జట్టులో చేరడానికి నేను రెడీగా ఉన్నా. క్వారంటైన్ నిబంధనలు గురించి తర్వాత ఆలోచిద్దాం’ అని సరదాగా కామెంట్ చేశాడు. బుమ్రా, షమి, ఉమేశ్, కేఎల్ రాహుల్, జడేజా, విహారి టెస్టు సిరీస్ కు దూరమయ్యారని తెలుపుతూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. 

 

 

Leave a Comment