భారత్ 336 ఆలౌట్.. శార్దూల్, సుందర్ ల రికార్డు భాగస్వామ్యం..!

గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. కీలక ఆటగాళ్లు వెనుదిరిగినా నిర్ణయాత్మక టెస్టులో సత్తా చాటారు. ఏడో వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాను గట్టేక్కించారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని గౌరవప్రదమైన స్కోర్ ను సాధించి పెట్టారు. 

కాగా 62/2 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో రహానే(37), అగర్వాల్(38) రాణించగా, వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67) వీరోచిత అర్ధ సెంచరీలతో ఆదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో హెజిల్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా, స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు, లియోన్ ఒక వికెట్ తీశారు. ఇక మూడో రోజా ఆట ముగిసే సమయానికి ఆసీస్ 21/0 తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

 

Leave a Comment