భారత్ సంచలన విజయం.. 2-1తో సిరీస్ కైవసం..!

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రిషభ్ పంత్ దూకుడు తోడు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై కొత్త చరిత్ర తిరగరాసింది. నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది. 

4/0 ఓవర్ నైట్ స్కోరుతో ఐదు రోజును ఆరంభించిన టీమిండియా కాసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ(7) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ గిల్ (91) పరుగులతో రాణించి ఇన్నింగ్స్ కు బలమైన పునాదులు వేశారు. కెప్టెన్ రహానే(24) ఔట్ అయినా పుజారా 56 పరుగులతో బాధ్యతగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇక ఆ తర్వాత రిషభ్ పంత్ తన దూకుడును కొనసాగించాడు. 138 బంతుల్లో 89 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో రాణించిన వాషింగ్టన్ సుందర్ 22 పరుగులతో మెరిపించి ఔటయ్యాడు. కానీ చివర్లో పంత్ ఫోర్ కొట్టి భారత్ కు విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. 

 

Leave a Comment