ఆసక్తికరంగా నాని కొత్త సినిమా టైటిల్..!

న్యాచురల్ స్టార్ నటిస్తున్న 28వ సినిమా పేరును ప్రకటించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేరక్స్ బ్యానర్స్ పై  ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి..’ అనే టైటిల్ పెట్టడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. 

ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో ఏదో సీక్రేట్ గురించి మాట్లాడుకుంటున్నట్లు వినిపించి, సస్పెన్స్ పెట్టారు. ఇక సినిమాలో మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. నజ్రీయా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే..అంతే కాదు ఈ సినిమాలో నజ్రీయా తన పాత్రకు తానే డబ్బంగ్ కూడా చెప్పుకోనుంది. ఇక ఈ సినిమాను 2021లో ఫన్ ఎంజాయ్ చేయవచ్చని వీడియోలో చూపించారు.    

Leave a Comment