‘సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’.. ఆసక్తి రేపుతున్న విరాట పర్వం టీజర్..

హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నారు. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా, డి.సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినమాను 1990 దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యాదర్థ సంఘటనల ఆధారాంగా తెరకెక్కిస్తున్నారు. డా.రవి శంకర్ అలియాస్ నక్సలైట్ నాయకుడు కామ్రేడ్ రవన్నగా దగ్గుబాటి రానా నటిస్తున్నారు.

 ‘ఒక దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’ అంటూ రవన్న పాత్రను పరిచయం చేశారు. అలాగే టీజర్ లో ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం..దోపిడి రాజ్యం అనే నినాదాలు కూడా వినిపించాయి.  కామ్రేడ్ భరతక్క పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. హీరోయిన్ సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అందరిలో అంచనాలను పెంచేసింది.  

 

Leave a Comment