IPL 2020 చాంపియన్ ముంబై ఇండియన్స్..

IPL 2020 Final : దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్-2020(IPL 2020) ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో డిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది.  ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ను రికార్డు స్థాయిలో ఐదో సారి కైవసం చేసుకుంది. 

టాస్ గెలిచి ముందుగా బ్యాగింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్లెన్ శ్రేయస్ అయ్యర్ 65 నాటౌట్, రిషబ్ పంత్ 56 అర్ధ సెంచరీలు సాధించారు. శిఖర్ ధావన్(15), రహానే(2) పరుగులతో నిరాశపరిచారు. మార్కస్ స్టొయినీస్(0), హెట్ మెయిర్(5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్ బౌలర్ బౌల్ట్ ఫైనల్ మ్యాచ్ లో తొలి బంతికే వికెట్ తీసి రికార్డు నెలకొల్పాడు. 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. 

ఇక 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 68(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్(33), క్వింటన్ డికాక్(20), సూర్య కుమార్ యాదవ్(19) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా, రబాడ, స్టాయినీస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – ట్రెంట్ బౌల్ట్(రూ.5 లక్షలు)

ఫెయిర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – ముంబాయి ఇండియన్స్

అత్యధిక సిక్సర్లు – ఇషన్ కిషన్ – ముంబై(30 సిక్సర్లు)

పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – ట్రెంట్ బౌల్ట్(5 అవార్డులు)

వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – జోఫ్రా ఆర్చర్(305 పాయింట్లు)

సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది ఇయర్ – కీరన్ పొలార్డ్(ముంబై)

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ – కేఎల్ రాహుల్(పంజాబ్)

ఎమర్జింగ్ ప్లేయర్ – దేవదత్ పడిక్కల్(బెంగళూరు)

పర్పుల్ క్యాప్ విజేత – కసోగ రబాడా( ఢిల్లీ) 30 వికెట్లు

ఆరెంజ్ క్యాప్ విజేత – కేఎల్ రాహుల్(పంజాబ్) 670 పరుగులు

ఐపీఎల్ 2020 ఫైనల్ విజేతకు ప్రైజ్ మనీ – రూ.20 కోట్లు

రన్నరప్ జట్టుకు – రూ.12.50 కోట్లు

ప్లే ఆఫ్ లో ఓటి జట్లకు – రూ.6 కోట్లు

 

Leave a Comment