ఎన్నికల్లో గెలవలేమని జగన్ కు భయమా ..! : అచ్చెన్నాయుడు

జగన్ రెడ్డికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎన్నికలకు వెళ్లెందుకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహిస్తుంటే వైసీపీకి భయమెందుకన్నారు. ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తున్నామన్నారు. 

కానీ, వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సింగిల్ జడ్జి కోర్టులో ఎన్నికల షెడ్యూల్ ను తాత్కాలికంగా అడ్డుకున్నారన్నారు. కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని అడిగిన జగన్ కరోనా లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. నిజంగా కరోనా ఉంటే నెల్లూరులో అమ్మఒడి సభను వేలాది మందితో ఎందుకు నిర్వహించారన్నారు. పశ్చిమ గోదావరిలో ఇళ్లపట్టాల కార్యక్రమం వేలాది మందితో నిర్వహించి ఇద్దరు మహిళల మరణానికి ఎందుకు కారకులయ్యారన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాత, తిరుపతి ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళుతామని ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి ఎలా చెబుతారని, ఉద్యోగ సంఘాలను కూడా కుట్రలో భాగస్వాములను చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారని తెలిపారు. ప్రస్థుత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే వైసీపీ అరాచక చర్యలు, ఎన్నికల ఫలితాలు తారుమారు సాగవని భయపడుతున్నారన్నారు.  నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాకోర్టులో ఓడిపోతామని జగన్ కు భయంపుట్టుకుంది.

 

Leave a Comment