800 ఏళ్ల తర్వాత నేడు ఖగోళంలో అద్భుతం..!

ఖగోళంలో సోమవారం రాత్రి అద్భుతం జరగనుంది. 2020 సంవత్సరంలో ఇప్పటికే 6 గ్రహణాలు ఏర్పడ్డాయి. వాటిలో నాలుగు చంద్ర గ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిదైన గ్రహణం.. రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడింది. తాజాగా సోమవారం రాత్రి గురు గ్రహం, శని గ్రహాలు ఒకే చోటుకు రానున్నాయి. 

ఖగోళంలోని కొన్ని గ్రహాలు వందల ఏళ్లకు ఒకసారి దగ్గరకు వస్తాయి. ఇలా రావడాన్ని సంయోగం అని పిలుస్తారు. తాజగా గురు గ్రహం, శని గ్రహాలు అతి దగ్గరగా రానున్నాయి. దీనిని మహా సంయోగం అని అంటారు. మిగితా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని గ్రహాలు దగ్గరకు రావడం శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది. 

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం 1623 తరువాత అంటే దాదాపు 400 ఏళ్ల అనంతరం ఆకాశంలో అలాంటి అద్భుతం కనిపిస్తుంది. అయితే సోమవారం రాత్రి జరిగే గురుడు, శని గ్రహాల కలయిక సంభవించడం 800 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారతదేశంలో ఈ ఖగోళ అద్భుతం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు కనిపించనుంది. ఈ సమయంలో గురు గ్రహం, శని గ్రహం కంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 

గురు, శని గ్రహాలు అతి సమీపంగా వస్తున్నప్పటికీ, ఈ రెండు గ్రహాల మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేడు రాత్రి రెండు గ్రహాలు 0.06 డిగ్రీల మే మాత్రమే ఎడంగా ఉండబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు మళ్లీ 2080 సంవత్సరంలో దగ్గరికి వస్తాయి. బైనాక్యులర్లు మరియు ఇతర పరికరాల ద్వారా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు. 

Leave a Comment