అద్భుతం : మంచుతో వినాయక విగ్రహం.. వీడియో వైరల్..

హిమాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. మనాలీ, కల్ప, కీలాండ్ సహా మరిన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కవ నమోదవుతున్నాయి. దీంతో రహదారులంతా మంచుతో నిండిపోతున్నాయి. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని ఓ మహిళ తన కళకు పనిచెప్పింది. 

పహాడీలోని శీతల వాతావరణంలో ఓ మహిళ ఆరుబయటే మంచుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. ఎంతో ఓపికగా ఆమె ఒక్కటే దీన్ని సృష్టించింది. మంచుతో అచ్చం గణపతి రూపాన్ని దించేసింది. మంచుతో వినాయకుడు తయారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment