యూకేలో కనిపించిన కొత్తరకం స్ట్రయిన్ కరోనా వైరస్ భారత్ లోనూ ప్రవేశించింది. ఈ వార్త భారతదేశంలో కలకలం రేపుతోంది. కరోనా పరీక్షల్లో భాగంగా ఆరుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గత నెల రోజుల్లో యూకే నుంచి భారత్ కు 33 వేల మంది వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దాణ అయింది.
వీరిలో ఆరుగురికి కొత్తరకం కరోనా స్ట్రయిన్ సోకినట్లు తేలింది. వీరిలో బెంగుళూరులో ముగ్గురు, హైదరాబాద్ లో ఇద్దరు, పూణెలో ఒకరికి ఈ వైరస్ సోకింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా వీరిలో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ కు తరలించారు.