పార్టీ పెట్టడం లేదు.. రజనీకాంత్ సంచలన ప్రకటన..

అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి పార్టీ పెట్టడం లేదని రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మూడు పేజీల లేఖను విడుదల చేశారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే..

ఈక్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం మళ్లీ ఆలస్యమైంది. రాజకీయాల్లో తప్పకుండా వస్తానని, కానీ ఇప్పుడు కాదని ఆయన ప్రకటించారు. అనారోగ్య కారణాలతో నూతన పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుంటున్నానని రజనీకాంత్ లేఖలో పేర్కొన్నారు.

అన్నత్తే సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్న రజనీకాంత్ అనారోగ్యానికి గురై హైదరాబాద్
ఆస్పత్రిలో ఐదు రోజుల కింద చేరారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయి చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనను కోరినట్లు పేర్కొన్నారు. దీంతో పార్టీ పెట్టడం ఖాయమనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. 

Leave a Comment