అనారోగ్యంతో ఉన్న అభిమానితో ఎన్టీఆర్ వీడియో కాల్..!

తమ అభిమానులను పలకరించే తారలు కొంత మందే ఉంటారు..అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానిలో ధైర్యం నింపారు. నేరుగా వీడియో కాల్ చేసి మాట్లాడారు. సాయం చేస్తానని మాటిచ్చారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కలిసి తప్పకుండా సెల్ఫీ ఇస్తానని హామీ ఇచ్చారు. 

నల్గోండ జిల్లా చండూరుకు చెందిన వెంకన్న హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆక్సిడెంట్ కావడంతో స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. దీంతో శరీరం చచ్చు బడిపోయి మంచానికే పరిమితమైపోయాడు. ఎన్నో ఆస్పత్రులు చూపించినా నయం కాలేదు. అయితే వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఆయనతో ఒక్కసారి అయినా సెల్ఫీ దిగాలని కోరిక ఉండేది. 

అతని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ నేరుగా వీడియో కాల్ చేశారు. ఆత్మీయంగా మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఎన్టీఆర్ ను కలవాలనే ఆశతో బతుకుతానని వెంకన్న చెప్పడంతో ‘నీకేం కాదు’ అంటూ ధైర్యం నింపారు. తన అభిమాన హీరో స్వయంగా వీడియో కాల్ చేయడంతో వెంకన్న ఆనందంతో ఉప్పొంగిపోయాడు. 

Leave a Comment