స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం కోర్టుకెక్కింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కాదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఏపీలో వివాదం నెలకొంది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది..

Leave a Comment