పుజారా ‘ది వాల్’ వైరల్ అవుతున్న ఫొటో..!

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా రికార్డు విజయం సాధించింది. సమిష్టి కృషి ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. కాగా నాలుగో టెస్టు రెండో ఇన్సింగ్స్ లో వన్ డౌన్ లో వచ్చిన పుజారా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. బెల్లెట్లలా దూసుకొచ్చే బంతులకు ఎదురొడ్డి నిలిచాడు. 

తలకు, చేతులకు, కడుపుకు ఎన్ని దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు. 211 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అందుకే పుజారాను మరో రాహుల్ ద్రావిడ్ అని పిలుస్తారు. కాగా పుజారా పోరాటంపై సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. పుజారా స్థానంలో ఓ బండ రాయిని పెట్టి ‘ ది వాల్’ అని కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment