రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన..!

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. 2021 జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు రజనీ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని వెల్లడగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతు నిలుస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రజనీ కాంత్ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు.   

Leave a Comment