అరుదైన నల్ల పులి.. మన ఇండియాలోనే..!

సామాన్యంగా పులులు ఏ రంగులో ఉంటాయి? పులులు ఎక్కువగా పసుపు చారాలతో ఉండటం చూస్తుంటాం..కానీ ఈ పులి మాత్రం నల్ల చారలతో చాలా వితంగా కనిపిస్తోంది. ఈ అరుదైన పులి ఎక్కడో విదేశాల్లో కాదు..

మన ఇండియాలోనే ఉంది. ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లో ఈ పులి ప్రత్యక్షమైంది. ఈ పులిని సౌమేన్ బాజ్ పేయ్ అనే ఫొటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ అరుదైన పులి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ పులులను మెలనిన్ టైగర్స్ అని పిలుస్తారు. ఈ పులు కూడా ఇండియాలో ఎక్కువగా కనిపించే బెంగాల్ టైగర్ జాతికి చెందినవే. కాకపోతే జన్యు లోపం వల్ల వీటి మీద ఉండే నల్ల చారలు శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి.

నల్లరంగు పులుల సంఖ్య దేశంలో ప్రస్తుతం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఆరో, ఏడో పులులు మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి సైజులో బెంగాల్ టైగర్ అంతా పెద్దది కాకుండా కొంచం చిన్నగా ఉంటాయి.  

 

Leave a Comment