బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి రోహిత్ శర్మ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

బిగ్ బాస్ – 4 విన్నర్ అభిజిత్ కి టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. అభిజిత్ తో ఫోన్ లో మాట్లాడాడు. అంతే కాదు ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్ గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన హనుమ విహారికి ధన్యవాదాలు కూడా తెలిపాడు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్, విహారి మాట్లాడుకుంటున్న సమయంలో బిగ్ బాస్ షో గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విహారి బిగ్ బాస్-4 విన్నర్ అభిజిత్ అని, అతను రోహిత్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. దీంతో రోహిత్ శర్మ అభిజిత్ కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడు. అతన్ని అభినందిస్తూ తన జెర్సీని గిఫ్ట్ గా పంపించాడు. జెర్సీ మీద విత్ లవ్, బెస్ట్ విషెస్..రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి ఇచ్చాడు. ఈ విషయాన్ని అభిజిత్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నాడు. రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ పేర్కొన్నాడు.  

Leave a Comment