జాతీయ గీతం పాడే సమయంలో కన్నీరు పెట్టుకున్న సిరాజ్..!

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతం పాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. సిరాజ్ లోపలి నుంచి ఉబికొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ జాతీయ గీతాన్ని అలపించాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

మహ్మద్ సిరాజ్ మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో టెస్టు ద్వారా టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో తన బౌలింగ్ లో మంచి ప్రదర్శకన కనబర్చాడు. ఇటీవల సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో సిరాజ్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. దానికి గల కారణన్ని కూడా ఆసమయంలో సిరాజ్ వెల్లడించాడు. తన తల్లి రావోద్దని కోరిందని, క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చూపడం ద్వారా తండ్రి కలను నెరవేర్చాలని చెప్పిందని పేర్కొన్నాడు. 

  

Leave a Comment