పంత్ గార్డ్ మార్క్ లను మార్చేసిన స్మిత్..!

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరోసారి చీటింగ్ కు పాల్పడ్డాడు. గతంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ కు పాల్పడిన స్మిత్ ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. తాజాగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పంత్ బ్యాటింగ్ చేసే క్రమంలో స్మిత్ మళ్లీ చీటింగ్ చేశాడు. 

ప్రతి క్రికెటర్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వెళ్లిన తర్వాత ముందుగా గార్డ్ తీసుకుంటారు. అది లెగ్ స్టిక్, మిడిల్ స్టిక్ అనేది బ్యాట్స్ మెన్ నిర్ణయించుకుంటాడు. గార్డ్ మార్చుకునే అవకాశం కేవలం బ్యాట్స్ మెన్ కు మాత్రమే ఉంటుంది. అయితే మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో గార్డ్ మార్క్ లను స్మిత్ మార్చేశాడు. 

చిన్న బ్రేక్ లో స్మిత్ పంత్ బ్యాటింగ్ గార్డ్ ను చెరిపేసి కొత్త గార్డ్ ను కాలుతో గీశాడు. ఇది కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్.. స్మిత్ ఏదైతే గార్డ్ గీశాడో దానిని అనుసరించే బ్యాటింగ్ చేశాడు. ఇలా చేయడం బ్యాట్స్ మెన్ ను మోసం చేయడమే అవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. చీటర్స్ ఎప్పుడూ చీటర్సే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  

Leave a Comment