రోడ్డుకు సోనూసూద్ తల్లి పేరు.. భావోద్వేగానికి గురైన సోనూ..!

కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చిన సోనూసూద్ వారి పాలిట దేవుడయ్యాడు. తన సేవా కార్యక్రమాలతో రిలయ్ హీరో అనిపించుకున్నాడు. ఈక్రమంలో సోనూసూద్ కు ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. 

తన సేవాగుణానికి తన తల్లి సరోజ్ సూద్ పెంపకమే కారణమని సోనూసూద్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని తమ స్వస్థలం మోగాలో ఓ రహదారికి సోనూసూద్ తల్లిపేరు పెట్టారు. ఆ రహదారికి ప్రొఫెసర్.సరోజ్ సూద్ రోడ్ గా నామకరణం చేశారు. ఈక్రమంలో సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు. 

తన కల, తన జీవితాశయం నెరవేరందని పేర్కొన్నారు. తన అమ్మ ఏ రోడ్డు గుండా తన జీవితకాలం ప్రయాణం చేసిందో ఇప్పుడు ఆ రోడ్డుకు ఆమె పేరు పట్టారని, స్వర్గంలో ఉన్న తన తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కచ్చితంగా సంతోషిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని సుసాధ్యం చేసిన హర్జోట్ కమల్, సందీప్ హాన్స్, అనితా దర్శకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రపంచంలో తనకిష్టమైన ప్రదేశం ప్రొఫెసర్.సరోజ్ సూద్ రోడ్ అని గర్వంగా చెప్పలనని ఉద్వేగానికి లోనయ్యారు. 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

Leave a Comment