బూతుల మంత్రిని ఊరి మీద ఆంబోతులా వదిలేశారు : అచ్చెన్నాయుడు 

బూతుల మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరిందని, ఇష్టాను సారంగా ఎవరినిపడితే వాళ్లను మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసలు ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు.  పనీబాట లేని ఊరిమీద ఆంబోతులా రాష్ట్ర ప్రజలపై కొడాలి నానిని విడిచిపెట్టారని విమర్శించారు. 

 తిట్ల మీద ఉన్న పట్టు తన శాఖపై లేదన్నారు. శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న ఉమామహేశ్వరరావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా? చేతనైతే చర్చకు రావాలి తప్ప కిరాయి మూకలతో అల్లర్లు సృష్టించడం ఏంటి? అని ప్రశ్నించారు. 

‘ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తిస్టవేశాయి. వాటిని పరిష్కరించడం చేతకావడం లేదు. ప్రజలు తంతారనే భయంతో రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు మొరుగుతామంటే చూస్తూ ఊరుకోం. తాగింది దిగేవరకు ఎవరినో ఒకరిని నాని తిడతారు. రెచ్చగొట్టేలా మాట్లాడిన నానిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదు.? కుట్రలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు‘ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

‘బడిత పూజ చేస్తానన్న నాని రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? అరాచకాలను తగ్గించుకుంటే బాగుంటుంది. అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. జనం ముందుకు నాని వస్తే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు. గుడివాడ ప్రజల సమస్యలు పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు. బాబాయి హత్య కేసులో మోడీ కాళ్లు పట్టుకునేందుకు జగన్ డిల్లీ వెళ్లారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నానిని జగన్ రెడ్డి వదిలారు. వైసీపీ తీరు చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు’ అంటూ అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు.  

 

Leave a Comment