టీమిండియా 244 పరుగులకు ఆలౌట్..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 244 పరులకు ఆలౌట్ అయింది.  96/2 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి 8 వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా(50), రిషభ్ పంత్(36) పర్వాలేదనిపంచారు. రహానె(22), రవీంద్ర జడేజా(28 నాటౌట్) పరుగులు చేశారు. ఇక మిగితా బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజ్ లో నిలబడలేకపోయారు. 

అందరూ స్వల్ప స్కోరకే వెనుదిరిగారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే టీమిండియా 94 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ నాలుగు, హజల్ వుడ్ రెండు, స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.. 

Leave a Comment