సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన.. భారత్ టార్గెట్ 328..!

గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. లబుషేన్, స్మిత్, వేడ్, స్టార్క్, హజల్ వుడ్ ల వికెట్లు తీసి ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. 

తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్ గా ఆస్ట్రేలియా 327 పరుగుల లీడ్ లో ఉంది. దీంతో టీమిండియా ముందు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 5, శార్దూల్ ఠాకూర్ 4, సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా టీమ్ లో స్మిత్ 55, వార్నర్ 48, గ్రీన్ 37 పరుగులతో రాణించారు. నాలుగో రోజు ముగిసే సమయానికి భారత్ వికెట్లు పడకుండా 4 పరుగులు చేసింది.  

Leave a Comment