ఆస్ట్రేలియా కెప్టెన్ కు అశ్విన్ ఘాటుగా బదులు.. క్షమాపణ కోరిన పైన్..!

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగి డ్రాగా ముగిసింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుస వికెట్లు సమర్పించుకోవడంతో కంగారులకు మ్యాచ్ సులువుగా మారింది. ఈక్రమంలో అశ్విన్, విహారీ జోడీ టీమిండియాను ఆదుకుంది. ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. భారత బ్యాట్స్ మెన్లపై పదేపదే నోరు పారేసుకున్నారు. 

ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పదే పదే స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడు. అశ్విన్, విహారీల వికెట్ ఎలా తీయాలో నోరుపారేసుకున్నాడు. ‘బ్రిస్పేన్ లో నీకోసం ఎదురు చేస్తుంటా’ అంటూ అశ్విన్ ను రెచ్చగొట్టాడు. దీనికి అశ్విన్ కూడా ఘాటుగా బదులిచ్చాడు. ‘భారత్ లో కూడా నీకోసం ఎదురు చూస్తా. అదే నీకు చివరి సిరీస్ అవుతుంది’ అంటూ సమాధానం చెప్పాడు. 

దీంతో మరింత ఆగ్రహించిన పైన్ తనపై తన జట్టుకు నమ్మకం ఉందని చెబుతూ బూతును ప్రయోగించాడు. అయినా అశ్విన్ ఏకాగ్రతను కోల్పోకుండా వికెట్ సమర్పించుకోకుండా ఆడాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాడు. ‘నేను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ టీమ్ ను లీడ్ చేయడాన్ని నేను ఎప్పుడు గర్వంగా ఫీలవుతాను. కానీ సిడ్నీ టెస్టు చివరి రోజు టీమ్ ను సరిగా లీడ్ చేయలేకపోయాను’ అని పైన్ చెప్పుకొచ్చాడు.   

Leave a Comment