బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడుని భర్తపై కేసు..!

బట్టతల ఉందన్న విషయాన్ని చెప్పకుండా భర్త తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ముంబైలోని మీరా రోడ్ కు చెందిన 29 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ గత నెలలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  

అతనికి బట్టతల ఉంది. కాకపోతే పెళ్లిలో విగ్గు పెట్టుకుని మ్యానేజ్ చేశాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురుకు కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. అయితే పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తన భర్తకు బట్టతల ఉందన్న విషయాన్ని భార్య గుర్తించింది. దీంతో తనను భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పెళ్లికి ముందు భర్త బట్టతల గురించి తనకు చెప్పలేదని, విగుగ్ పెట్టుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు తనను వేధిస్తున్నారని చెప్పింది. భర్త కూడా తనపై అనుమానాలతో తన ఫోన్ ను హ్యాక్ చేసి కాల్ రికార్డులు, చాటింగ్ విషయాలు చేక్ చేస్తున్నాడని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment