ప్రియుడితో భార్య రాసలీలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన భర్త..!

ప్రియుడితో రాసలీలు జరుపుతున్న భార్యను పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం జరిగింది. వివరాల మేరకు ఆళ్లగడ్డ రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది. 

అయితే ఆ అధ్యక్షుడు ఏమో తనకు రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పాడు. ఇలా పరిచయం పెంచుకుని ఆ ఆటోడ్రైవర్ భార్యతో చనువు పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి తరచూ ఇంటికి వస్తుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని తన ఇంటికి రావద్దని చెప్పాడు. 

ఈక్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి ఆటో డ్రైవర్ భార్యతో రాసలీలు కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారు గమనించి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే భర్త ఇంటికి వచ్చాడు. తన భార్య ఆ వ్యక్తితో రాసలీలు జరపడం గమనించాడు. అప్పుడు వాళ్లు ఉన్న గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్ కు తరలించారు. 

 

Leave a Comment