క్రికెట్ ను చంపేశాడు.. విహారీ బ్యాటింగ్ పై కేంద్ర మంత్రి విమర్శలు..

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగి డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో అశ్విన్, హనుమ విహారి విరోచితంగా పోరాడారు. ఆసీస్ చేతిలోకి మ్యాచ్ పోకుండా కాపాడారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ హనుమ విహారి ఎంతో పట్టుదలతో ఆడాడు. కండరాలు పట్టేసినా నొప్పిని భరస్తూ 161 బంతులు ఆడాడు. 

దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం విహారీ బ్యాటింగ్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ‘7 పరుగులు చేసేందుకు 109 బంతలా ఆడటమా.. ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్ ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్నా హనుమ బిహారి పోగొట్టాడు.. ఇది నేరం’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇక కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే విహారి మాత్రం దానికి ఒకే ఒక పదంతో సమాధానం చెప్పాడు. తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ ‘హనుమ విహారి’ అంటూ ట్వీట్ చేశాడు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తిట్టిపోశారు.

Leave a Comment