కరోనా కాలంలో తన సేవా కార్యక్రమాలతో సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడయ్యాడు. దీంతో దేశవ్యాప్తంగా సోనూసూద్ ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో అవార్డులు దక్కించుకున్నాడు. ఇటీవల సోనూసూద్ కు 2020 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.
తాజాగా సోనూసూద్ ని ఓ చిన్నారి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ దివ్యాంగ బాలుడు నోటితో సోనూసూద్ పెయింట్ వేశాడు. ఆ బాలుడి టాలెంట్ చూసి సోనూసూద్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్వరలోనే అతనిని కలుస్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram